Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగార్జునతో తాను సినిమా తీస్తున్నాను, ఇది మరో శివ స్థాయిలో ఉంటుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేస్తూ వచ్చాడు. వర్మ, నాగ్ల కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా కూడా ఉంటుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ‘ఆఫీసర్’ డిజాస్టర్ అయ్యింది. వర్మ ఈ సినిమాపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో షూటింగ్ సమయంలో ఆయన ట్వీట్ చేసిన ట్వీట్స్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమాను టెక్నికల్‌గా మరియు స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా చూపించబోతున్నాను అని, కొత్త టెక్నాలజీతో సినిమాను తీస్తున్నాను అంటూ ఇలా పలు రకాలుగా వర్మ ట్వీట్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచాడు. దాంతో అందరు కూడా బాగుంటుందేమో అనుకున్నారు.
సినిమా తీరా విడుదలైన తర్వాత కనీసం వారం రోజులు కూడా ఆడలేక పోయింది. వర్మ చెప్పినదాంటో కనీసం 10 శాతం కూడా లేదంటూ స్వయంగా అక్కినేని అభిమానులు నిటూర్చారు. ఇంతటి దారుణమైన సినిమాను తీసినందుకు వర్మకు అన్ని వర్గాల నుండి ఆక్షేపణలు, విమర్శలు వస్తున్నాయి. దాంతో వర్మకు ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కావడం లేదు. వర్మ తాను చేసిన సినిమాలు ఒకవేళ ప్లాప్ అయితే ఆ విషయాన్ని ఒప్పుకుంటాడు. కాని ఆఫీసర్ విషయంలో అలా జరగలేదు. ఆఫీసర్ ఫెయిల్యూర్‌ను ఆయన జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆకారణంగానే వర్మ గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌కు దూరంగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పకుండా కామ్‌గా ఉంటున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. వర్మ చాలా కాలం తర్వాత తన సినిమా ఫెయిల్ అయినందుకు బాధ పడుతున్నట్లుగా అనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.