Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు లు చిత్ర సీమలో తమదైన బ్రాండ్ కలిగిన వాళ్ళు. వాళ్ళ టేస్ట్, ఛాయస్ మీద జనాలకు నమ్మకం ఎక్కువ. అలాంటిది తొలిసారి ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఫిదా. ఒడ్డు,పొడుగు, అందం ,టాలెంట్ అన్ని వున్నా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫామిలీ హీరో వరుణ్ తేజ్ , అందంతోనే కాదు నటనతోను మెప్పిస్తున్న నేటి తరం నటి సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఫిదా.
ప్రేమకథలు తీయడంలో శేఖర్ కమ్ముల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది చాన్నాళ్ల తర్వాత శేఖర్ తీస్తున్న ప్రేమ కధ ఫిదా. ఆయన ప్రేమకథలో హీరో తో సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక ప్రస్తుతం వస్తున్న ఫిదా లో వరుణ్ తేజ్, సాయి పల్లవి పాత్రలు కూడా అంతే అని శేఖర్ ముందుగానే చెప్పేసారు. పైగా ఇందులో హీరోయిన్ ఎలా ఉంటుందో నా కూతురు కూడా అలా వుండాలని కోరుకుంటా అని శేఖర్ చెప్పిన మాటలతో ఫిదా మీద అంచనాలు పెరిగాయి. ఆత్మవిశ్వాసం మెండుగా వుండే నేటి తరం అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ప్రేమలో గెలవడం ఎలా ఉంటుందో చూపే సినిమా ఫిదా.
మరిన్ని వార్తలు