Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధారణంగా ఆరెస్సెస్ కు, లెఫ్ట్ కు అస్సలు పడదు. అందుకే విద్యార్థి సంఘాల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. అయినా సరే ఓ ఎంపీగా వెంకయ్య మాత్రం అన్ని పార్టీలతోనూ వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. ఎక్కడా ఆరెస్సెస్ లైన్ దాటకుండానే.. తెలుగువాడైన వామపక్ష ఎంపీ ఏచూరితో గాఢమైన అనుబంధాన్ని అల్లుకున్నారు.
వెంకయ్యను వెల్కమ్ చేస్తూ ఏచూరి ఇచ్చిన స్పీచ్ వింటే ఈ విషయం తెలిసిపోతోంది. సాధారణంగా ఎవర్నీ పొగడని ఏచూరి కూడా వెంకయ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. వెంకయ్య ఛైర్మన్ షిప్ చూడకుండానే.. తాను వెళ్లిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల కంటే వెంకయ్య గురించి తనకే ఎక్కువ తెలుసన్నట్లుగా ఏఛూరి మాట్లాడారు.
ఒక్క ఏచూరే కాదు.. ఎవ్వరినీ లెక్కచేయని తమిళ ఎంపీలు కూడా వెంకయ్యను ఆకాశానికెత్తారు. వెంకయ్యను తమిళుడిగానే భావిస్తామని, తమకంటే తమిళనాడు గురించి వెంకయ్యకే తెలుసని వారు చెప్పారంటే అది చిన్న విషయం కాదు. చివరకు మోడీని తీవ్రంగా విమర్శించే తృణమూల్ ఎంపీలు కూడా వెంకయ్య దగ్గరకు వచ్చేసరికి ప్రశంసల జల్లు కురిపించడమే వెంకయ్య చాకచక్యానికి నిదర్శనం
మరిన్ని వార్తలు: