సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. సినీ ఇండస్ట్రీకి చెందిన తల్లిదండ్రులు కూడా ప్రేమకు పెద్ద మనసుతో అంగీకరించి వివాహం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రేమకథ పెళ్లిపీటలెక్కబోతోందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహానికి వాళ్ల ఇంట్లో పెద్దలు అంగీకరించినట్టు సమాచారం. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది . కేవలం సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసి పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా మార్చి 1న చేయాలనీ నిర్ణయించారట . పెళ్లి వేడుక భారీ ఎత్తున చేయనున్నాం కాబట్టి ఎంగేజ్ మెంట్ కు సన్నిహితులను మాత్రమే పిలిచారట వెంకీ కుటుంబం. వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు ఒక అబ్బాయి కాగా ఆశ్రిత పెద్ద కూతురు . సురేందర్ రెడ్డి మనవడు తో ఆశ్రిత పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ ప్రేమ పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈరోజు వివాహ నిశ్చితార్థం జరుగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామి రెడ్డి కుమారుడే అతడు. అయితే ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇరు కుటుంబాలు ఇప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.