ఎన్టీఆర్ మనవరాలి మీద పోటీనా?

Posted [relativedate] at [relativetime time_format="H:i"]

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించి ఎట్టి పరిస్థితుల్లో కోడలు బ్రాహ్మణి ని లోక్ సభ కి పంపాలని కృతనిశ్చయంతో ఉన్నారట . ఇందులో భాగంగా ఆమెకి ఏ స్థానం అయితే సేఫ్ అని ఓ సర్వే కూడా నిర్వహించారట ఇటీవల. అందులో విజయవాడ కన్నా గుంటూరు సేఫ్ అని తేలిందట. ప్రస్తుతం స్థానిక ఎంపీ గా వున్న గల్లా జయదేవ్ కి రాజ్యసభ ఆఫర్ ఇచ్చి ఆ స్థానంలో బ్రాహ్మణిని గెలిపించే బాధ్యత కూడా అప్పగిస్తారని టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది నిజమా, కాదా అన్న చర్చ టీడీపీ లో సాగుతుంటే అటు వైసీపీ లో గుంటూరు నుంచి పోటీకి తహతహలాడుతున్న లావు రత్తయ్య కొడుకు శ్రీకృష్ణ దేవరాయలు టెన్షన్ పడుతున్నారట. బ్రాహ్మణి తో తలపడి గెలవడం చిన్న విషయం కాదని తెలియడంతో తమ కుటుంబానికి ఇప్పటిదాకా రాజకీయాలు అచ్చిరాని సెంటిమెంట్ కూడా దేవరాయల్ని భయపెడుతోంది.ఆ సెంటి మెంట్ కి దారి తీసిన నిజాలేంటో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.

లావు రత్తయ్య అంటే కన్నా విజ్ఞాన్ రత్తయ్య అంటే ఏపీ ప్రజలు ఆయన్ని తేలిగ్గా గుర్తు పడతారు. ఇప్పుడున్న రెసిడెన్షియల్ కాలేజీలకు విశేష ప్రాచుర్యం కల్పించి, మంచి ఫలితాలు సాధించిన ఘనత విజ్ఞాన్ రత్తయ్యదే అని చెప్పడానికి ఏ సందేహం అక్కర్లేదు. విజ్ఞాన్ సక్సెస్ తర్వాత ఆయన రాజకీయాలు, జర్నలిజం లో మక్కువ తీర్చుకోడానికి రత్తయ్య ప్రయత్నించారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన రత్తయ్య పార్టీలో చేరకపోయినా తన పత్రిక సుప్రభాతం ద్వారా టీడీపీ కి మద్దతుగా నిలిచారు. 1994 లో టీడీపీ సాధించిన ఘనవిజయాన్ని ఊహించి సర్వే ద్వారా గెలిచే అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించడం అప్పట్లో ఓ సంచలనం. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీ కి రత్తయ్య దూరం అయ్యారు. లక్ష్మీపార్వతి తరపున బాపట్లలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతికి దూరమై అప్పట్లో హరికృష్ణ పెట్టిన అన్న తెలుగు దేశం పార్టీని భుజాన మోస్తూ 1999 లో సుప్రభాతం లో టీడీపీ ఓడిపోతుందని చేయని ఓ సర్వే ప్రకటించి అభాసుపాలయ్యారు. ఇక 2004 కి వచ్చేసరికి కాంగ్రెస్ తరపున బాపట్ల టికెట్ రత్తయ్యకి ఇప్పించడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే టీడీపీ తరపున టికెట్ ఇస్తామని బాబు దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందని తీరా టైం దగ్గరికి వచ్చేసరికి దగ్గుబాటి ఫోన్ ఎత్తడం మానేశారట రత్తయ్య. దీంతో ఆ సీట్లో కి పురందేశ్వరి వచ్చి గెలవడం, కేంద్రమంత్రి కావడం అందరికీ తెలిసిందే.

2009 లో లోక్ సత్తా తరపున విజ్ఞాన్ రత్తయ్య మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 కి వచ్చేసరికి చివరినిమిషంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు ఆయన. కానీ ఎక్కడా టికెట్ రాలేదు. అయితే పార్టీ మారకుండా అలాగే కొనసాగడంతో ఇప్పుడు రత్తయ్య కొడుకు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు లోక్ సభ పార్టీ ఇంచార్జి గా జగన్ నియమించారు. ఈసారి ఎన్నికల్లో గుంటూరు టికెట్ కూడా అతనికే ఇస్తారని బలంగా వినిపిస్తోంది. తనకి అచ్చిరాని రాజకీయాలు కొడుక్కి అయినా అచ్చి వస్తాయని రత్తయ్య ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈసారి ఆ స్థానం లో బ్రాహ్మణి పోటీ పడొచ్చన్న వార్తలతో రత్తయ్య హర్ట్ అవుతున్నారట. ఎన్టీఆర్ మీద అభిమానంతో చంద్రబాబుని వ్యతిరేకించి ఇన్నిసార్లు దెబ్బ తిని ఇప్పుడు అయినా ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు అదే ఎన్టీఆర్ మనవరాలు చంద్రబాబు కోడలుగా పోటీ పడటం ఏంటని తన సన్నిహితులతో ఆవేదనగా అంటున్నారట.