అప్పుడు 40 అనుకున్నా, కాని ఇప్పుడు 35 ఏళ్లకే..!

Vijay Devarakonda Present In Love

‘పెళ్లి చూపులు’ చిత్రంతో క్లాస్‌ ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించిన విజయ్‌ దేవరకొండ తాజాగా అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను తన బుట్టలో వేసేసుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో పెళ్లి గురించి పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు. గతంలో ఈయన 40 ఏళ్లకు వివాహం చేసుకోవాలనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాని గీత గోవిందం చిత్రం చేసిన తర్వాత తన మైండ్‌ సెట్‌ను మార్చుకున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను 35 ఏళ్ల వయస్సు రాగానే వివాహం చేసుకోవాలని ఫిక్స్‌ అయినట్లుగా పేర్కొన్నాడు. పెళ్లి విషయంలో తనకు ఎలాంటి పట్టింపు లేదని, తన కుటుంబ సభ్యులు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి గురించిన పెద్దగా పట్టింపు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

vijaydevarakonda

నాకు 35 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకుంటాను అని, అయితే ఆ అమ్మాయి ఎవరు అనే విషయంలో తాను ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి కులం, మతం ఏదైనా అవ్వొచ్చు. ఆమె తెలంగాణ లేదా మరే రాష్ట్రానికి చెందిన అమ్మాయో లేదంటే ఈ ప్రపంచంలో ఏదో ఒక దేశంకు చెందిన అమ్మాయి అయినా కావచ్చు అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. పెళ్లి విషయంలో ఇంత క్లారిటీగా ఉన్న విజయ్‌ దేవరకొండకు కాబోయే అమ్మాయి ఎవరో చాలా లక్కీ అంటూ అమ్మాయిలు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటూ తేల్చి చెప్పిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ప్రేమలోనే ఉన్నాడేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

vijay1