అర్జున్‌ రెడ్డికి అయిదు లక్షలేనా?

Vijay Devarakonda Revealed His Remuneration For Arjun Reddy Film

విజయ్‌ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంతకు ముందు రెండు మూడు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. పెళ్లి చూపులు తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం చేయడంతో విజయ్‌ దేవర కొండ క్రేజ్‌ మొత్తం మారిపోయింది. అయితే అర్జున్‌ రెడ్డికి ఈయన తీసుకున్న పారితోషికం కేవలం అయిదు లక్షలు. అవును నిజంగా అయిదు లక్షలు అంటూ స్వయంగా విజయ్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా తన అర్జున్‌ రెడ్డి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును వేలం కార్యక్రమం నిర్వహించాడు. ఆ కార్యక్రమంలో దివీస్‌ ల్యాబరేటరీస్‌ అధినేత కొనుగోలు చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలకు విజయ్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అమ్ముడు పోయింది.

ఆ కార్యక్రమంలో మొదట తన అవార్డుకు ఒక వ్యక్తి అయిదు లక్షల రూపాయలు ఇస్తాను అంటూ ముందుకు వచ్చాడు. ఆ మొత్తం తన పారితోషికం అని, తాను అర్జున్‌ రెడ్డికి తీసుకున్న పారితోషికానికే అవార్డు ఇచ్చేలా అంటూ తాను అనుకున్నాను. అయితే దివీస్‌ వారు నా అవార్డును నా వద్దే ఉంచుకొమ్మనడంతో పాటు 25 లక్షల రూపాయలు ఇచ్చి కొంటామని ముందుకు వచ్చారు. అయితే తాను అవార్డును వారికే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డి సినిమాకు కేవలం అయిదు లక్షల పారితోషికం తీసుకుని, సినిమా సక్సెస్‌ అయితే లాభాల్లో వాటా తీసుకునేలా మాట్లాడుకున్నారు. పారితోషికం అయిదు లక్షలే అయినా కూడా లాభాల్లో వాటా ద్వారా కనీసం 5 నుండి 7 కోట్ల వరకు వచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మనోడు ఒక్క సినిమాకు 7 నుండి 10 కోట్లు కూడా డిమాండ్‌ చేస్తున్నాడు.