మరోసారి ప్రత్యేకతను చాటుకున్న రౌడీ హీరో…!

Vijay Deverakonda Surprises Celebrities Kids

విజయ్ దేవరకొండ ఏపని చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది , ఆ మద్య గీత గోవిందం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అందరిని అచ్చర్యానికి గురి చేసేలా తెల్ల లుంగీ కట్టుకొని వచ్చేశాడు. టాక్సీ వాల చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాన్ని చిన్న పిల్లలతో షార్ట్ ఫిలిం చేసి చూపించాడు. అందరి హీరోలా కాకుండా తన పద్ధతి నలుగురిలో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. టాక్సీవాల పైరసీ అయితే ప్రభాస్, విజయ్ కు సానుబూతి తెలుపుతూ ట్విట్టర్ లో స్పందించారు. దానికి విభిన్నంగా సాహో షూటింగ్ వివరాలు అడిగి అందరిని ఆచర్యానికి గురి చేశాడు. రౌడీ స్టార్ విజయ్ గురుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా విజయ్ టాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలను తన ఇంటికి పిలిచి గెట్ టు గెదర్ ఏర్పాటుచేశాడు.

The Vijay Devarakonda Movie Remuneration Is Only Rs 40 Lakh

ఆ గెట్ టు గెదర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ నీయాంశం అయ్యింది. అందులో రవి తేజ పిల్లలు, రాజమౌళి కూతురు, శోభుయార్లగడ్డ పిల్లలు, బీవిఎస్ రవి పిల్లలు, కీరవాణి కూతురు ఇలా చాలా మంది సెలబ్రిటీ పిల్లలు ఉన్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెట్ టు గెదర్ అంటే కొంచెం రౌడీ ఇజం కూడా ఉంటుంది మరి. ఈ పార్టీ కి వచ్చిన పిల్లలు అందరు రౌడీ టీ షర్ట్స్ వేసుకొన్ని ఫొటోస్ కి పోజులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు కానీ ఇలా సెలబ్రిటీస్ పిల్లలను గెట్ టి గెదర్ ఎవరు చేయలేదు అనుకుంటున్నారు. విజయ్ ఫ్యూచర్ లో పెద్ద స్టార్ గా ఎదుగుతాడు అని ప్రేక్షకుల్లో గట్టి నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇతడి చేతల్లో కొంచెం పవన్ కళ్యాణ్ పోలికలు కనపడుతాయి అంటున్నారు అభిమానులు.