యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ సినిమా తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. వీటిలో ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 న రిలీజ్ కానుండగా గౌతమ్ తీస్తున్న సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. విషయం ఏమిటంటే, ఈ రెండిటి అనంతరం ఇటీవల రాజా వారు రాణి గారు సినిమా తో మంచి విజయం అందుకున్న రవికిరణ్ కోలా తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా చేయనునట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోందట. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగె పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా సాగనుండగా, గౌతమ్ తిన్ననూరితో విజయ్ తన మూవీ ను ముగించిన వెంటనే ఇది సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నది .