Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. అయితే ఇదంతా కూడా ఆపరేషన్ గరుడలో భాగమేనని మోత్కుపల్లి చేత ఒక కులాన్ని రెచ్చకొట్టి రాజకీయంగా లబ్ది పొందడానికి బీజేపీ-వైసీపీల రహస్య కూటమి ప్రయత్నిస్తుందని తెదేపా నేతలు విమర్శలు సైతం చేశారు. అయితే మొన్నటికి మొన్న కాపు ఉద్యమ నేత ముద్రగడను కలిసిన తర్వాత ఆ విమర్సలకు మరింత ఊతం ఇచ్చినట్టయ్యింది.
అయితే కొద్దిరోజుల నుండి కేసీఆర్ ఒకరకమయిన భజన చేస్తున్న మోత్కుపల్లి. టీఆర్ఎస్‌లో చేరుతారన్నవార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి, మోత్కుపల్లిని కలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఒకరకంగా మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు.