Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భార్యాభర్తల బంధం బీటలు వారితే ఆ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి అనడానికి టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య ఘటన పెద్ద ఉదాహరణ. ఇద్దరి మధ్య విభేదాలు, కేసులు, విడాకుల వ్యవహారం పక్కనబెడితే ఇన్నాళ్లు కాపురాన్ని కనీసం కూడా గౌరవించిలేని పరిస్థితిలో వున్నారు ఆ భార్యాభర్తలు. చనిపోయే ముందు విజయ్ తీసిన సెల్ఫీ వీడియోలో తన భార్యను వ్యభిచారిగా అభివర్ణించాడు విజయ్ సాయి. ఆమె మున్ముందు తన బిడ్డకు తల్లిగా సమాజంలో ఉంటుందన్న చిన్న విషయాన్ని కూడా గమనించలేదు. పైగా ఆ పరిస్థితుల్లో తన కూతురు బతకడం ఇష్టం లేదని, ఆమెను తీసుకురమ్మని తండ్రిని ప్రాధేయపడడం ఆ వీడియోలో వుంది.
ఇక విజయ్ సాయి మరణం తర్వాత వనితారెడ్డి స్పందించిన తీరు కూడా అలాగే వుంది. డబ్బు కోసం తాను అతన్ని వేధించలేదని చెప్పిన ఆమె ఆపై అమ్మాయిలతో అతనికి సంబంధాలు ఉన్నాయని తెలిసి బంధం తెంచుకున్నట్టు చెప్పింది. వాటి గురించి అడిగితే వేధించాడని కూడా వనితారెడ్డి వివరణ ఇచ్చింది. అంతవరకు ఓకే అనుకుంటే అమ్మాయిలతో తిరిగి తిరిగి అతను ఎయిడ్స్ తెచ్చుకున్నాడని వనితారెడ్డి అంటోంది. ఈమె కూడా రేపటి సమాజంలో తన కూతురు తండ్రిగా విజయసాయి పేరు చెప్పాల్సి ఉంటుందన్న మాటే మర్చిపోయి మాట్లాడేస్తోంది. బంధాలు తెగిపోయినా అవతలి వ్యక్తుల కనీస గౌరవ, మర్యాదలను దెబ్బ తీయడం వారిని మాత్రమే శిక్షించడం కాదు. వారి సంతానం మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ చిన్న విషయం గుర్తుంచుకుంటే మన జీవితాలు ఎలా వున్నా రేపటి తరం అయినా కాస్త హాయిగా బతుకుతుంది.