Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుంచి ఎందుకో వైసీపీ ఇబ్బంది పడుతూనే వుంది. తొలుత భూసేకరణకు అడ్డంకులు కల్పించాలని ప్రయత్నం చేసింది. అయితే రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వడానికి స్వచ్చంధంగా ముందుకు రావడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అయితే ఆ తరువాత వివిధ అంశాలను సాకుగా చూపి కొందరితో కోర్టుల్లో కేసులు వేయించింది. ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో అమరావతిని గుర్తించనట్టు ఉండిపోయింది. అందుకే ఆ పార్టీ కార్యాలయం కూడా చాలా ఏళ్ళ పాటు హైదరాబాద్ లోనే ఉండిపోయింది. ఎన్నికలవేళ ఇది పెద్ద అడ్డం అవుతుందని పార్టీ సీనియర్ నాయకులు నెత్తినోరు కొట్టుకోవడంతో తాత్కాలిక కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేశారు. అయినా జగన్ అక్కడికి పెద్దగా వచ్చిందీ లేదు , పెట్టింది లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసింది ఇంకో ఎత్తు. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలని అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ రాష్ట్రం లో అయినా ఎన్నికలు అసెంబ్లీ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. అందుకు భిన్నంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను హైదరాబాద్ లో నిర్వహించమనడం ద్వారా విజయసాయి ఏ సంకేతాలు ఇస్తున్నట్టు ?. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాక కూడా అమరావతి అంటే చిన్న చూపు ప్రదర్శిస్తూ వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది.