విజయసాయిరెడ్డి మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడుగా !

Vijaya Sai Reddy tongue slip heats up Politics in YSRCP

ఒకప్పుడు వైకాపా అధినేత జగన్ ని సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో ఎక్స్పర్ట్ అనేవారం, ఎందుకంటే అసలేలాంటి హోం వర్క్ చేయకుండానే ఆయన బయటకి వచ్చి పేపర్ మీదున్నది చదివేసేవారు. కాలక్రమేనా ప్రశాంత్ కిషోర్ మహత్యమో లేక పార్టీ అంతర్గత చర్చల పుణ్యమోగానీ ఇప్పుడు సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ఆ బాధ్యత పవన్ నెత్తికి ఎత్తుకున్నట్టున్నాడు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు జగన్ పార్టీలో నెంబర్ 2 గా చెప్పే విజయసాయిరెడ్డి కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాస్టర్ అయిపోయినట్టున్నాడు. ఒకప్పుడు గతంలో మత్స్యకారుల దీక్ష వద్దకు వెళ్లి వాళ్ళ కరపత్రం పసుపు రంగు లో ఉందని వాళ్ల మీద విరుచుకు పడి సెల్ఫ్ గోల్ వేసుకున్న ఉదంతం, పార్లమెంటులో మోడీ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి బీజేపీ పైన పీకల దాకా ఉన్న ఆంధ్ర ప్రజల దృష్టిలో చులకన అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో విజయసాయిరెడ్డి కొత్త సెల్ఫ్ గోల్ అనంతపురం జిల్లా ఎస్పీ మీద చేసిన వ్యాఖ్యలతో వేసుకున్నాడు. సాధారణంగా రాజకీయాల్లో ప్రధమ శ్రేణి నేతలు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. మీడియా ద్రుష్టి అంతా వారి మీదనే ఉంటుండు అందుకే ఎదుటివారిపై ఏదైనా ఆరోపణ లేదా విమర్శ చేసేటప్పుడు వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుండా నోరు జారితే మాత్రం అభాసుపాలు కావడం ఖాయం.

ఇప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన అంశం మీద మాట్లాడిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఈ పరిస్థితే ఏర్పడింది. ధర్మవరం పట్టణానికి చెందిన నాగూర్ హుస్సేన్ పరిటాల రవి హత్యానంతరం నుండి అజ్ఞాతంలో ఉన్నాడు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన బయటకు వచ్చారన్నారని, పరిటాల శ్రీరాం అతడికి ఆశ్రయం కల్పించారని అలాగే నాగూర్‌ హుస్సేన్ టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి సంబంధించిన ఒక పంచాయతీలో తలదూర్చాడని ఈ నేపథ్యంలో నాగూర్‌ మారణాయుధాలతో పోలీసులకు పట్టుబడ్డారని అతనిపై కేసులు పెట్టకపోగా, అధికారపార్టీ నేతల సూచన మేరకు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అతన్ని జిల్లా సరిహద్దు దాటించారనీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణపై విజయ సాయి మీడియా సమావేశం ముగిసిన వెంటనే జిల్లా ఎస్పీ స్పందించారు. విజయసాయిరెడ్డి పేర్కొన్న తేదీల్లో అసలు తాను దేశంలోనే లేననీ, విదేశాలకు వెళ్లానని కావాలంటే పాస్ పోర్టు చెక్ చేసుకోవచ్చునని ప్రకటించారు. దీంతో అసలే ఆధారాలతో విజయ సాయి ఆరోపణలు చేసాడో తెలియని వైకాపా నేతలు కూడా నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. జిల్లా పార్టీ నేతలు చెప్పే మాటలను ఆసరా చేసుకుని విజయసాయి మాట్లాడారనీ, అందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోలేదనీ అర్ధమవుతోంది. ఈ విధంగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతే వైసీపీ పరిస్థితి ఏమిటా అని పార్టీ క్యాడర్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారట.