Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని హీరో అఖిల్ రెండవ చిత్రం ‘హలో’ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘హలో’ చిత్రాన్ని ఈనెల 22న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటుంది. అఖిల్ మొదటి చిత్రం నిరాశ పర్చడంతో రెండవ చిత్రం అయినా తప్పకుండా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో నాగార్జున చాలా గట్టి పట్టుదతో స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. నిర్మాణంతో పాటు అన్ని విభాగాల్లో కూడా కల్పించుకుంటున్నాడు అంటూ మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఎడిటింగ్ మరియు ఇతరత్ర పనుల్లో నాగార్జున ఎక్కువగా కల్పించుకోవడంతో దర్శకుడు విక్రమ్ ఆగ్రహం వ్యక్త ంచేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. విక్రమ్ చెప్పినదానికి ఓకే చెబుతూనే చిన్న చిన్న మార్పు అంటూ నాగార్జున మార్పులు చేర్పులు చెబుతూ, చేయిస్తూ ఉన్నాడట. దాంతో దర్శకుడు చిరాకు పడుతున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. అఖిల్ రెండవ చిత్రంతో అయినా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఇలా ప్రతి దాంట్లో కూడా కల్పించుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కొట్టి పారేస్తున్నారు.