Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల వివాహం దేశమంతటా ఆసక్తి రేకెత్తించింది. ఇలా ఓ బాలీవుడ్ నటిని ఇండియన్ క్రికెట్ కెప్టెన్ పెళ్ళిచేసుకుని 48 ఏళ్ళు అయ్యింది. అప్పట్లో కెప్టెన్ తో పాటు రాచ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ప్రత్యేకత వున్న పటౌడీ, షర్మిల ని పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు విరాట్ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తూ బాలీవుడ్ భామని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ పెళ్ళికి ముందు ప్రేమబంధంలో వున్నారు. ప్రేమ పక్షుల్లా విహరించారు. అయితే పెళ్ళిలో ఏ మహత్తు వుందో, ఏమో గానీ వేదిక దగ్గరకు వచ్చేసరికి అనుష్క సిగ్గులమొగ్గ అవుతూ కనిపించింది. కావాలంటే మీరూ ఓ లుక్ వేయండి.