Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. శ్రీలంకతో తొలి టెస్టులో 50సెంచరీలు పూర్తిచేసుకున్న కోహ్లీ ఢిల్లీలో జరగుతున్న మూడో టెస్టులో మరో మైలురాయి చేరుకున్నాడు. టెస్ట్ కెరీర్ లో 5వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. 63 మ్యాచ్ ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 104 ఇన్నింగ్స్ లో 4, 975 పరుగులు చేసిన కోహ్లీ 105వ ఇన్నింగ్స్ లో మిగిలిన పరుగులు చేశాడు. భారత్ తరపున టెస్టుల్లో 5వేల పరుగులు చేసిన 11వ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. అంతేకాకుండా అత్యంత వేగంగా 5వేల పరుగులు సాధించిన నాలుగో బ్యాట్స్ మెన్. సునీల్ గవాస్కర్ 95 ఇన్నింగ్స్ లో, సెహ్వాగ్ 98 ఇన్నింగ్స్ లో, సచిన్ 103 ఇన్నింగ్స్ లో 5000 పరుగులు చేశారు. దీంతో పాటు మరో రికార్డు కూడా కోహ్లీ పేరిట నమోదయింది.
సచిన్ తర్వాత చిన్న వయసులో ఐదువేల పరుగులు చేసింది కూడా కోహ్లీనే. సచిన్ 25 ఏళ్ల వయసులో ఐదువేల రన్స్ పూర్తిచేయగా విరాట్ 29 ఏళ్లకు ఈ ఘనత సాధించాడు. అయితే ఇప్పటి క్రికెటర్లతో పోలిస్తే పాతతరం క్రికెటర్లు వన్డేలు, టీ20ల కన్నా ఎక్కువగా టెస్టులు ఆడేవారు. కాబట్టి వారు టెస్టుల్లోనే ఎక్కువ పరుగులు చేసేవారు. కానీ ప్రస్తుత క్రికెటర్లు టెస్టులు తక్కువగా… వన్డేలు, టీ 20లు ఎక్కువగా ఆడుతున్నారు. అలాంటి తరుణంలోనూ కోహ్లీ చాలా తొందరగా 5000 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. వన్డేలు, టీ20లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ కు ఫిట్ నెస్ చాలా అవసరం. ఐదురోజులు మైదానంలో గడపడం… శరీరం అన్నివిధాలా సహకరిస్తేనే సాధ్యం. తిరుగులేని ఫిట్ నెస్ తో ఉండడం వల్లే విరాట్ అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేలు, టీ20ల్లోనే ఒకేవిధంగా రాణిస్తున్నాడు