ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి కాస్త సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. ఎటూ ఆయన భార్య సినీ సెలెబ్రిటీ కావడం ఇందుకు మరింత సహాయ పడింది. దీంతో ఆ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో కూడా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడట విరాట్. ఒకప్పుడు టీవీ యాడ్, రేడియో ప్రకటనలతో నడిచే వ్యాపార ప్రకటనలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కి సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే సెలబ్రిటీలను వాడుకుంటూ వారికి భారీగా చెల్లింపులు కూడా చేస్తోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడట.
ఇన్స్టాగ్రామ్ షెడ్యూలర్ హౌప్పర్హెచ్క్యూ విడుదల చేసిన 2018 ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ జాబితాలో, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు ఎవరెంత సంపాదిస్తున్నారో వెల్లడించిం దింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి 17వ స్థానంలో ఉన్నారట. కోహ్లి ఒక్కో పోస్టుకు లక్షా 20వేల యూఎస్ డాలర్లను అంటే సుమారు రూ.82,45,000ను ఆర్జిస్తున్నారని తెలిపింది. ఇన్స్టాగ్రామ్లో కోహ్లికి 23.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ జాబితాలో 10 లక్షల యూఎస్ డాలర్లతో కైలీ జెన్నర్ అగ్రస్థానంలో నిలిచారు.