అఖిల్‌కు అక్కినేని ఫ్యాన్స్‌ ఓపెన్‌ లెటర్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తిండి పోతారు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని దశాబ్దాల క్రితం తెలుగులో అక్కినేని ఫ్యాన్స్‌ లక్షల్లో ఉండేవారు. ఎయన్నార్‌ మరియు నాగార్జునలకు అభిమానులు జాతీయ స్థాయిలో ఉండేవారు. కాని ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌ రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నారు. ఈ విషయం అక్కినేని ఫ్యామిలీ కూడా గుర్తించింది. కాని ఏం చేయాలో వారికి కూడా పాలుపోవడం లేదు. తాజాగా వైజాగ్‌ అక్కినేని ఫ్యాన్స్‌ అక్కినేని అఖిల్‌కు ఒక ఓపెన్‌ లెటర్‌ రాయడం జరిగింది. ఆ లెటర్‌ అక్కినేని ఫ్యాన్స్‌ పడుతున్న ఇబ్బందులకు అద్దం పట్టే విధంగా ఉంది.

ఆ లెటర్‌లో… అక్కినేని ఫ్యాన్స్‌ కొన్నాళ్ల క్రితం లక్షల్లో ఉండేవారు, కాని ఇప్పుడు వేలల్లోకి పడిపోయారు. ఇందుకు కారణం తాతగారు ఎయన్నార్‌ లేదా నాన్న గారు నాగార్జున, అన్న గారు నాగచైతన్య లేదా మీరో కాదు. మీ పక్కన ఉండే వర్కర్స్‌. మీరు ఎంతగా అభిమానులను అభిమానిస్తారో మాకు తెలుసు. కాని మీ పక్కన ఉన్న వారు మీకు తెలియకుండానే మీ అభిమానులమైన మమ్ములను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పలు సందర్బాల్లో మీ దగ్గర వర్క్‌ చేసే వారు అక్కినేని ఫ్యాన్స్‌ అంటూ వచ్చిన వారిని చాలా దారుణంగా అవమానించి, బయటకు నెట్టేశారు.

మీ పక్కన ఉన్న వారి అభిప్రాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు వేల మంది మాత్రమే అక్కినేని ఫ్యాన్స్‌ ఉన్నారు. అఖిల్‌ సినిమా ఉత్తరాంధ్రలో 100కు పైగా థియేటర్లలో విడుదల చేస్తే, మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఎంసీఏ కోసం మీ రెండవ సినిమా ‘హలో’ను 50 థియేటర్లలో మాత్రమే విడుదల చేశారు. అదేంటి అంటే మా ఇష్టం, హైదరాబాద్‌ వారిని అడగండి అంటున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే వేలల్లో ఉన్న అక్కినేని అభిమానులు వందల్లోకి వస్తారనే భయంగా ఉందని వైజాగ్‌ అక్కినేని ఫ్యాన్స్‌ అఖిల్‌ను ఉద్దేశించి లేఖ రాయడం జరిగింది. మరి ఈ లేఖకు అక్కినేని అఖిల్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Akkineni-fans-open-letter