ఏపీలో గ్రామ వాలంటీర్ల దారుణాలు ఒక్కక్కొటి బయటపడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ వ్యవహారం బయటకు వచ్చింది. మొన్న విశాఖలో ఓ మహిళపై వాలంటీర్ దాడి చేసిన సంఘటన మరువక ముందే… ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ సంఘటన బయటకు వచ్చింది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… కాశినాయన మండలంలో మాచవరం చెన్నారెడ్డి, అమ్మాయి (22) వాలంటీర్లుగా పనిచేస్తూన్న సమయంలో వీళ్లిద్దరి సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. వేరే అబ్బాయితో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరగా, చెన్నారెడ్డి పెళ్లి సంబందాన్ని చెడగొట్టి అమ్మాయిని తీసుకుని సోమవారం బెంగుళూర్ వెళ్లాడు. బుధవారం తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి గ్రామంలో వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ అమ్మాయి చెన్నారెడ్డి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో, చెన్నారెడ్డి ఇంటిముందు బైఠాయించింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.