ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్…రెండు రోజులు వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మిథిలి తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయువుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపానుగా బలపడుతుందని దీనికి మిథిలీగా నామకరణం చేయనున్నారు.
ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్న కారణంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఏపీలో కూడా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దని సూచనలు చేశారు.