Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
త్వరలో బస్సు యాత్ర చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో జనసేన పార్టీని జనంలోనికి తీసుకెళ్లడానికి ఏర్పాటైన శతఘ్ని రెజిమెంట్ మీద ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన తరఫున ఐటీ, సోషల్ మీడియాలో క్రియాశీలమైన పాత్ర పోషించేందుకు ఏర్పడిన ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. దానికి అనుగుణంగానే వ్యుహకర్త గా దేవ్ ని నియమించుకుని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుంచీ పోటీకి సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ వెనక ఉండి ఒక నిర్మాత అన్నీ చూసుకుంటున్నారు అని జనసేనకి అన్నీ తానయి నడిపిస్తున్న ఆ నిర్మాత ఎవరా అనే చర్చ మొదలయ్యింది.
పవన్ కి అత్యంత సన్నిహితులుగా పేరున్న బండ్ల గణేష్, శరత్ మ,అరార్ పేర్లు వచ్చినా జనసేనకి అండగా ఉంటూ నడిపిస్తున్నది మాత్రం చుట్టాలబ్బాయి సినిమాతో నిర్న్మాతగా మారి ఇటీవలే రవితేజతో నేల టికెట్ తెరకెక్కించిన రాం తాళ్ళూరి అని తెలుస్తోంది. స్వతహాగా ఎన్నారై అయిన రాం క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అనుకుంటూ ఆ దారికి జనసేనను ఎంచుకున్నారని. అందుకే, ఈయన ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి చాలా అవసరాలకు నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ -రామ్ మంచి స్నేహితులని మొదటి నుండి అమెరికాలో జనసేన పార్టీ ప్రచారానికి సంబంధించిన పనులను, అమెరికా ఎన్. ఆర్. ఐ వింగ్ కు సంబంధించి డీలింగ్స్ అన్నీ రామ్ అండర్ లోనే జరుగుతాయని తెలుస్తోంది.
కేవలం పార్టీ కి సంబంధించిన వ్యక్తులతోనే ఉంటూ సినిమా వాళ్లకు పూర్తిగా దూరంగా ఉన్న సమయంలో సినిమావాళ్ళు ఎవరైనా కలవాలని వచ్చినా..ఆఫీస్ గేట్ వద్ద నుంచే వెనుదిరగాల్సి వస్తోందిట. కానీ రాం మాత్రం ఏ నిముషాన అయినా పవన్ ని కలిసేందుకు వెనుకాడరు అట. ఇటీవల నేల టికెట్ ఆడియో ఫంక్షన్ కి కూడా ఇదే ప్రేమతో పవన్ హాజరయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ తలపెట్టిన బస్సుయాత్రకు కూడా రామ్ తాళ్లూరినే కర్త, కర్మ అని తెలుస్తోంది. అమెరికాతోపాటు, హైదరాబాద్ లో కూడా ఆయనకి కొన్ని కంపెనీలున్నాయి. ఎలా అయినా పవన్ సారధ్యంలో 2019 ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యే యోచనలో రాం ఉన్నట్టు తెలుస్తోంది,