ఈసారి దుబ్బాకలో ఎవరి జెండా ఎగరవేస్తారో..?

Whose flag will be hoisted in Dubbaka this time..?
Whose flag will be hoisted in Dubbaka this time..?

2020కి ముందు వరకు దుబ్బాక ఈ నియోజకవర్గం గురించి ఎవరికి పెద్దగా తెలియదు. సాధారణ నియోజకవర్గాలలో ఒకటి. కానీ 2020 ఉప ఎన్నిక రాష్ట్రం లోనే కాకుండా, దేశంలోనే ప్రత్యేకం గా మారింది. 2018లో బిఆర్ఎస్ అభ్యర్థి రామ లింగారెడ్డి దుబ్బాక నుండి గెలిచారు. కానీ 2020 అతని మరణం తర్వాత దుబ్బాకకు ఉప ఎన్నిక జరిగింది. అందులో బీజేపీ నేత రఘునందన్ రావు గెలిచారు. ఈసారి కూడా రఘునందన్ రావు బిజెపి నుండి టికెట్ ఆశిస్తున్నారు. రఘునందన్ రావుకి సొంత పార్టీ నుండి అసమ్మతి ఉంది. రఘునందన్ రావు అధికార పార్టీ నియోజకవర్గానికి ఏమి చేయలేదు అని విమర్శిస్తున్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును బిఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రతిపాదించింది. పేరును ప్రకటించినప్పటి నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీగా ఉండే నియోజకవర్గానికి అన్ని తానే చేశానని ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక పై జిల్లా మంత్రి అయిన హరీష్ రావు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈసారైనా దుబ్బాకలో కచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ ఇలా ఉంటే కాంగ్రెస్ తన అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదించింది. బిఆర్ఎస్ అధికార పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదు, రఘునందన్ రావు పై ఉన్న వ్యతిరేకత అనే విమర్శలతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈసారి నియోజకవర్గంలో పట్టు సాధించాలి అని అనుకుంటున్నారని రాజకీయాల్లో విశ్లేషణ. మరి ఈసారి దుబ్బాకపై పట్టు సాధించేది ఎవరో? చూడాలి.