అవునుగానీ … ఒరేయ్ మామా !! ఒక వేళ జగనన్న , పవనన్న పొత్తు కుదిరి అధికారం లోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉందిరా … జగనన్న కేమో ఆయనే ముఖ్యమంత్రి కావాలని, పవనన్నకి తనే ముఖ్యమంత్రి కావాలని ….ఏం జరగొచ్చు అంటావ్??ఇద్దరు కొట్టుకుంటారు అంటావా ?? లేకపోతే పాత సినిమా లో మాదిరి స్నేహం కోసం త్యాగం చేస్తారంటావా ??
.వాళ్ళు కొట్టుకోరు , త్యాగాలు చేసుకోరు కానీ పని నువ్వు నీ పని చుస్కోరా ..
.అలా ఎలా కుదురుతుంది ?? అయితే ముఖమంత్రి కుర్చీ కోసం గొడవ పడాలి లేకపోతే ఒకరు త్యాగం చేయాలి … ఇద్దరు ముఖ్యమంత్రు లు కాలేరు కదా … ఒకరు నాయకుడు అయితే మరి ఇంకొకరు సైనికుడా ??
.ఇద్దరూ ముఖ్యమంత్రులు అయితే నీకేమన్నా అభ్యంతరమా ??
.అలా ఎలా కుదురుతుంది రా సామి ??
.కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తారేమో… ఆలోచించు .!!
.కొత్త రాజకీయమా ??
.అవును .. ఒకవేళ వీళ్ళు అధికారం లోకి వస్తే సోమవారం నుండి గురువారం దాకా జగనన్న ముఖ్యమంత్రి… . శుక్రవారం నుండి ఆదివారం దాకా పవనన్న ముఖ్యమంత్రి..
.ఇదేం కొత్త రాజకీయం రా సామి … చెత్త రాజకీయం ఐతేనూ …
.చెత్త ఏముంది ?? సోమవారం నుండి గురువారం దాక జగనన్న బాగా పరిపాలించి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి , శని,ఆది వారాలు ఓదార్పు యాత్ర చేసుకుంటాడు …పవనన్న ఈ నాలుగు రోజులు సినిమా లలో నటించేసి మూడు రోజులు రాజకీయం లో జీవించేస్తాడు .
.అధికారం లో కి వస్తే ఆయన ఓదార్పులు , ఈయన సినిమా లు ఎందుకు రా బాబు ??
.అలవాటు రా బాబు అలవాటు … వేటి వల్ల వీళ్ళకు గుర్తింపు వచ్చిందో వాటిని వదుకోలేరు కదా ..!!