Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో అత్యంత సీనియర్ జూనియర్ పొలిటీషియన్ రాహుల్ గాంధీనే. ఎందుకంటే ఎప్పుడో 2004లో ఎన్నికల గోదాలోకి దిగి విజయం సాధించిన రాహుల్.. అప్పట్నుంచీ రాజకీయాల్లో పరిణతి చెందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు ప్రధాని పదవిని తోసిపుచ్చిన రాహుల్.. ఇప్పుడు అధ్యక్ష పదవిని కూడా విజయవంతంగా చాలాసార్లు తిరస్కరించారు.
కానీ రాహుల్ ఇక తప్పించుకునే వీలులేదు. ఎందుకంటే సోనియా ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంది. వరుసగా 19 ఏళ్లుగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ ను ఆమె నడిపిస్తున్నారు. అసలు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నా.. తప్పనిసరై సోనియా క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా రాహుల్ ముందుకు రాకపోతే… పార్టీ నేతగానే కాదు.. ఓ కొడుకుగా కూడా విఫలమైనట్లే అనే వాదన వినిపిస్తోంది.
సెప్టెంబర్లో రాహుల్ అధ్యక్షుడౌతారని ఇప్పటికే ఇంగ్లీష్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో సోనియా కీలక పాత్ర పోషించారు. రేపు రాహుల్ అధ్యక్షుడైనా ఆమె కీలకంగా ఉంటారు. వచ్చే ఎన్నికల్లో సోనియాదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. కానీ ఎన్నికల ఫలితాల్ని బట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.
మరిన్ని వార్తలు: