తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఏ మాట మాట్లాడినా రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ర్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఇటు తెలంగాణ రాష్ట్రానికి గాని, అటు మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు గాని, సంతోషాన్ని ఇవ్వలేక పోయిందని, అరాచకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని అలా జరిగి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు సక్రమంగా అభివృద్ధి జరిగి సంతోషంగా ఉండేవని వ్యాఖ్యానించారు. అయితే మోదీ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసిన..దీన్ని ఇంకా రాజకీయంగా వాడుకునేందుకు తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందా? అనే డౌట్ వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బిజేపిలని నడిపించేది ఆంధ్రా నాయకులే అని కేటిఆర్ లాంటి వారు మాట్లాడుతున్నారు.
ఇప్పుడు మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ఇంకా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. తెలంగాణ అభివృద్ధిని చూడలేకే మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని గురించి ఇప్పటికే ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇక ఈ అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ వాడి ఎన్నికల్లో లబ్దిపొందేలా బిఆర్‌ఎస్ నేతలు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాజకీయంగా ప్రత్యర్ధులని ఎదుర్కోవడం కంటే సెంటిమెంట్ తో దెబ్బకొట్టవచ్చు అనేది బిఆర్‌ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి ఎన్నికల సమయంలో ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది బిఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.