భర్త డ్రైవర్ తో ఎఫైర్…యాక్సిడెంట్ లాంటి మర్డర్…!

woman kills her husband with driver

తన భర్త వద్ద పని చేసే డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఏర్పచుకున్న ఓ మహిళ తన భర్తను చంపితే ఆయన ప్రభుత్వ ఉద్యోగం, ఎల్‌ఐసీ బీమా డబ్బులు వస్తాయని తన ప్రియుడైన డ్రైవర్ చేతనే హత్య చేయించింది ఓ మహిళ. వినడానికి భయం కలిగించేలా ఉన్న ఘటన హైదరబాద్ లో జరిగింది. అందుతున్న వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కమ్మగూడలోని భవానీనగర్‌ కాలనీకి చెందిన కేశ్యా నాయక్‌ తో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బొర్రయపాలెంకు చెందిన కేతావత్‌ పద్మకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పద్మకు సంతానం కలగకపోవడంతో కేస్యా నాయక్.. శైలజ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మొదటి భార్య పద్మతో అతడికి గొడవలు జరుగుతున్నాయి. భర్త తనను వేధిస్తున్నాడంటూ ఎనిమిదేళ్ల క్రితం తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో పద్మ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది.

car-accediet-driver
కేశ్యానాయక్‌ రెండో వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడని, తాను మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోందని భావించిన పద్మ అతణ్ని అంతమొందించాలని భావించింది. భర్తను హత్య చేస్తే రూ. 60 లక్షల బీమా సొమ్ముతోపాటు ఆయన ఉద్యోగం తనకు వస్తుందని చంపేయాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా కోర్టు వాయిదాల కోసం కేస్యనాయక్‌తో కలసి వచ్చే డ్రైవర్‌ సభావత్‌ వినోద్‌తో పద్మ పరిచయం పెంచుకుంది. డబ్బుతో పనవ్వదని భావించి భర్త తనను పట్టించుకోవడం లేదని, అతన్ని నమ్మించి వివాహేతర బంధం ఏర్పరచుకుంది. ఆయన్ను చంపి రోడ్డు ప్రమాదంగా సీన్ చేస్తే రూ. 60 లక్షల బీమా డబ్బుతో ఇద్దరం ఎక్కడికైనా వెళ్లి బతకచ్చని ఆశ చూపింది. దీంతో కేశ్యా నాయక్‌కు వినోద్‌ ఫోన్‌ చేసి ఎల్బీ నగర్‌లో కలిశాడు. ఆగస్టు 31న రాత్రి 10.30 సమయంలో కేస్యా నాయక్‌‌ను కారు ఎక్కించుకుని గుర్రంగూడ సమీపంలోని ఓ బార్‌కు వెళ్లాడు. ఇద్దరు కలిసి అక్కడ రాత్రి 12.30 వరకూ మద్యం తాగారు. అనంతరం ఇంటికి తిరిగి బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కారు ముందు సీటులో మత్తులో నిద్రిస్తున్న కేస్యా నాయక్‌‌ను వినోద్‌ గొంతు నులిమి చంపేశాడు.

car-driver

కేస్యా నాయక్‌ను హత్య చేసిన తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు వినోద్ కారును 100 కి.మీ. వేగంతో తీసుకెళ్లి తెలివిగా ఎడమ వైపు స్తంభానికి ఢీకొట్టాడు. స్థానికులు కారు ప్రమాదం జరిగిందని సమాచారం పోలీసులు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. కేస్యా నాయక్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేస్యా నాయక్ శరీరంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వినోద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్‌, పద్మను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.