హైదరాబాద్: ఒకవేళ ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశిస్తే.. ఆ మ్యాచ్‌ను ఫ్రీ టు ఎయిర్‌గా ప్రసారం చేస్తామని స్కై స్పోర్ట్స్ ఛానల్ సెమీస్ పోరుకు ముందు ప్రకటించింది. అయితే ఆసీస్‌ను దెబ్బతీసిన ఇంగ్లండ్ ఫైనల్లో ప్రవేశించింది. దీంతో ఆతిథ్య దేశం ఇంగ్లండ్ సంబరాల్లో తేలిపోయింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌ను స్కై ఛానల్ ఫ్రీ టు ఎయిర్‌గా ప్రసారం చేయనున్నది. ఛానల్ 4 దానికి పార్ట్నర్గా వ్యవహరించనున్నది. యూకేకు చెందిన స్కై స్పోర్ట్స్‌కే వరల్డ్‌కప్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు ఉన్నాయి. స్కై వన్ చానల్ కూడా ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయనున్నది. 1992లో చివరిసారి ఇంగ్లండ్ ఫైనల్లో ప్రవేశించింది. ఇంగ్లండ్, ఐర్లాండ్‌లో ఫైనల్ మ్యాచ్‌ను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు.