- ఒక పత్రికా ప్రకటనలో బిజేపీపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
- ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారు: యనమల
- దొంగలు అందరినీ దేశం దాటిస్తున్నారు.
- అవినీతిపరులతో అంటకాగుతున్నారు.
- ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారు.
- బిజేపీ పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయి.
- ప్రధాని నరేంద్రమోది ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయి.
- విజయ్ మాల్యా, నీరవ్ మోది, మెహుల్ చోక్సీ పరారీ వెనుక గుట్టుమట్లు వెల్లడించాలి.
- ఆర్ధిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావడం వెనుక సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు ఎవరు..?
- 8ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏమిటి?
బాబ్లీ మీద పోరాటం ఎవరి కోసం..?
- 74మంది ఎమ్మెల్యేలు,ఎంపిలు లాఠీదెబ్బలు తిన్నదెవరి కోసం..?
- తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్నదే టిడిపి ధ్యేయం.
- రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపిని దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోది వ్యూహం
- టిడిపి ఆధ్వర్యంలో మోది వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బిజెపిలో అక్కసు.
- బిజెపి వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకే మోది మహా కుట్రలు చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు రావడం ఇందులో భాగమే.
- తమ చెప్పుచేతల్లో మీడియా సంస్థల ద్వారా బోగస్ సర్వేలు ఇందులో భాగమే
- 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజాతీర్పు రుజువు చేసింది
- సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యం వేధింపు చర్యలకు ప్రజలే గుణపాఠం చెబుతారు.
- తెలుగు ప్రజల గుండెల్లోనుంచి టిడిపిని దూరం చేయడం ఎవరి తరం కాదు: ఆర్ధికమంత్రి యనమల