వైసీపీ బస్సు యాత్ర..దశల వారీగా దిశా నిర్దేశించిన సీఎం జగన్..!

Good news for AP people… 5 lakh more houses for Sankranti
Good news for AP people… 5 lakh more houses for Sankranti

వైసీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. విజయవాడ వైసీపీ ప్రతినిధుల సభలో వైసీపీ పార్టీ నాలుగు కీలక కార్యక్రమాలు ప్రకటించింది. ప్రతి సచివాలయ పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళనున్నారు వైసీపీ పార్టీ శ్రేణులు. మొదటి దశలో సచివాలయ పరిధిలోని లబ్దిదారుల జాబితా ప్రదర్శన చేయపట్టనున్నారు. రెండో దశ పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

మూడో దశలో ఇంటింటి సందర్శన చేపట్టనుంది వైసీపీ పార్టీ. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పని తీరు కంపేరిషన్ వివరిస్తారు. ఇక బస్సు యాత్ర చేయనుంది వైసీపీ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి వెల్లడించడానికి బస్సు యాత్రను ఉపయోగిస్తున్నారు. మూడు నెలల పాటు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టనున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం లో భాగంగానే… సచివాలయ, మండల, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు జరుగనున్నాయి. జనవరి 17 వరకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కొనసాగుతుంది.