Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డ పార్టీలే ఇప్పడు ఆయన మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వైసీపీ వ్యూహకర్తగా ఆంధ్రాలో అడుగు పెట్టిన వెంటనే ప్రశాంత్ కిషోర్ జగన్ కి మొదటగా చెప్పింది, తాను చేసింది ఏమిటో తెలుసా ?. చంద్రబాబుని ఢీకొట్టాలంటే బీహార్ లో వలే ఇక్కడ కూడా జనసేన,వామపక్షాలు, లోక్ సత్తా ని కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయాలని జగన్ కి ప్రశాంత్ హితబోధ చేయడమే కాదు అవకాశం ఇస్తే వచ్చి కలుస్తానని పవన్ కి లేఖ కూడా రాశారు. అయితే ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. వైసీపీ మీద సానుకూలత లేని పవన్ ఆ ప్రయత్నాలకు లొంగలేదు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ టార్గెట్ గా పవన్ ఏ స్థాయిలో మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నంద్యాల ఉప ఎన్నికల కోసం పవన్ మద్దతు కోసం దేబిరిస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇదే విషయం మీద జనసేన అధినేత పవన్ కి లేఖ రాసినట్టు తెలుస్తోంది. నంద్యాలతో పాటు కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లోనూ కలిసి పని చేద్దామని రఘువీరా కోరినట్టు సమాచారం. పవన్ ఏమంటాడో తెలిసి తెలిసి రఘువీరా, వైసీపీ ఇలా లేఖలు రాయడం వెనుక కూడా ఓ రాజకీయం ఉందట. పవన్ టీడీపీకి ఎక్కడ మద్దతు ప్రకటిస్తారో అన్న భయంతో ఆయన మీద ఒత్తిడి పెంచడానికి వైసీపీ, కాంగ్రెస్ ఈ లేఖా రాజకీయం చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు: