టీడీపీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహంతో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోమవారం భేటీ కావడం అనేక చర్చలకు దారి తీస్తోంది. తోట నరసింహం స్వగ్రామం కిర్లంపూడి మండలంలోని వీరవరంలోని నరసింహం ఇనికి వచ్చిన బొత్సా నరసిహంతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య అరగంట సేపు చర్చలు జరిగాయి. తోట నరసింహం పార్టీ మారతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతున్న తరుణంలో ఆయనతో బొత్స భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమచి పార్టీ మారినప్పుడే తోట కూడా పార్టీ మారడం ఖాయమనే వార్తలొచ్చాయి. అయితే అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన ఆయన పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని చెబుతున్న తోట నరసింహం తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన సందర్భంగా ఆయన ముందు ఈ డిమాండ్‌ను ఉంచారు. ఆ స్థానంలో ఇపుడు టీడీపీ తరఫున వైసీపీ నుండి తీదీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తోట నరసింహంతో బొత్స భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు గత ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీచేసిన చలమశెట్టి సునీల్ సైకిల్ ఎక్కబోతున్న తరుణంలో ఈ భేటీ ఆసక్తి రేకెత్తిస్తోంది.