Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిన్నమొన్నటిదాకా చంద్రబాబు తొత్తు అన్న విమర్శలు ఎదుర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోందో నిన్నటి సభతో తేలిపోయింది. ఇకపై తాను టీడీపీ తో కలిసి వెళ్ళేది లేదని ఈ సభ ద్వారా పవన్ చెప్పేసారు. అయితే ఒక్కసారిగా పవన్ వ్యూహం ఇలా మారిపోవడం వెనుక లోగుట్టు ఏమిటో తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ కి మద్దతు ఇవ్వాలి అనుకుంటున్న పవన్ అందుకు అనుగుణంగా బాణీ మార్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు వైసీపీ కి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ నిర్ధారించారు.
పార్లమెంట్ లో విలేకరులతో చిట్ చాట్ చేసిన వరప్రసాద్ జనసేన భవిష్యత్ వ్యూహాన్ని బయటపెట్టారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు వున్న పరిచయంతో ఇటీవల పవన్ కళ్యాణ్ వరప్రసాద్ ని పిలిచారట. వైసీపీ తన మీద ఎందుకు విమర్శలు చేస్తోందని పవన్ అడిగారట. అందుకు వరప్రసాద్ బదులు ఇస్తూ వైసీపీ ని అవినీతి పార్టీ అంటున్నందుకే తాము కౌంటర్ చేస్తున్నామని చెప్పారట. తాను తెలుగుదేశంతో వుండేదిలేదని చెప్పిన పవన్, వచ్చే ఎన్నికల తరువాత అవసరం అయితే జగన్ కే జనసేన ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారట. ఈ విషయాలను వరప్రసాద్ బయటపెట్టడంతో జనసేన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.