Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సంచనాలకు మారు పేరు. ఆయన సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రెండు నెలల్లో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఓ దశలో ప్రధాని మోడీ కంటే సీఎం యోగిపైనే ఎక్కువ వార్తలొచ్చాయి. అభివృద్ధి, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, వినూత్న కార్యక్రమాలతో ఆయన దూసుకుపోయారు. కానీ ఇప్పుడు యోగికి చుక్కలు కనిపిస్తున్నాయి. గోరఖ్ పూర్ శిశుమరణాలు గుక్కతిప్పుకోనివ్వడం లేదు. శిశుమరణాలతో యోగిలో సహనం చచ్చిపోయినట్లే కనిపిస్తోంది. ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా ప్రజలకు నీతులు చెబుతున్నారు. గోరఖ్ పూర్ మఠంలో చెప్పే సూత్రాలు వల్లిస్తున్నారు. పౌరస్పృహ లేనిదే ప్రభుత్వాలు ఏమీ చేయలేవంటున్నారు. అంత సత్యం తెలిసినప్పుడు ఎన్నికల్లో ఎడాపెడా హామీలెందుకిచ్చారని జనం ప్రశ్నిస్తున్నారు. పిల్లల్ని రెండేళ్లు పెంచేసి.. ప్రభుత్వం మీద భారం వేస్తున్నారన్న ఒక్క మాటతో యోగి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.
గోరఖ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క నెలలోనే వందల మంది పిల్లలు మరణించారు. అయితే దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోని యోగి.. నెపాన్ని జనం మీదే నెట్టేస్తున్నారు. చివరకు ఆవు పాలు మీరు తాగుతారా.. వాటి పేడ మేం ఎత్తాలా అంటూ చీప్ గా మాట్లాడుతున్నారు. దీంతో యోగి డిఫరెంట్ ఏమీ కాదని, ఈయనా ఆ తానులో ముక్కేనని జనం అనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: