Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు ఆనాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాస్త అటూ ఇటుగా ఉన్నా నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలని ఒప్పుకోక తప్పదు. కానీ అలాంటి భావి భారత ఇంజినీర్లను, డాక్టర్లను ఒత్తిడి అనే మహమ్మారి కబళిస్తోంది. భారతదేశంలోని యువతీ, యువకులలో అధికశాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ యువ జనాభాలో ఎక్కువ శాతం భారత్ లోనే వున్నారని ప్రపంచ నివేదిక పేర్కొంది. యువత ఎక్కువగా మానసిక సమస్యలతో నిరాశ, నిస్పృహ, ఒత్తిడికి లోనై కుంగి కృషించి పోతున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 32 కోట్ల మంది యంగస్టర్స్ మానసిక ఒత్తిడికి లోనవుతుండగా.. వాళ్లలో 5 కోట్ల మంది భారతీయులు ఉన్నారంటే.. యువత ఎంతలా ఆందోళనకు లోనవుతున్నారో ఊహించుకోవచ్చు…
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-2015 నివేదికలో ఈ విషయాలను ప్రచురించింది డబ్ల్యుహెచ్వో సంస్థ. దేశంలో ప్రతి పది మందిలో ఒకరు మానసిక సమస్యలతో చిధ్రమవుతున్నారంది వాల్డ్ నివేదిక. ఈ ఏడాది ఒత్తిడి వల్ల 7.8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్లలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలియజేసింది. నిన్న హైదరాబాద్ లో చూసిన జస్లిస్ కౌర్ ఉదంతం ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో లోపాల మీద చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికయినా మన పిల్లల్లో గెలుపొక్కటే అనే విషాన్ని ఎక్కించడం ఆపేసి గెలుపోటములు జీవితంలో సహజమని చిన్న చిన్న అంశాల రిత్యా ఆత్మహత్య చేసుకోవడం తగదు అని వారికి ఉగ్గిపాల వయసు నుండే నూరిపోయాలి. లేదంటే ఇంకెంత మంది జస్లిస్ కౌర్ లను పోగొట్టుకుంటామో.