Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మహాభారత యుద్ధాన్ని తలపిస్తున్నాయి. 2019 లో గెలవకపోతే పార్టీనే ఉండకుండా పోతుందని వైసీపీ అధినేత జగన్ భయం. ఆ భయాన్ని నిజం చేసి కొడుకు లోకేష్ కి స్మూత్ గా అధికారం అప్పగించాలని చంద్రబాబు ఆశ. ఈ ఆశలు, ఆశయాలు ఎలా వున్నా వారి బతుకుని, భవిష్యత్ ని నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు జగన్ ని నమ్ముతారా లేదా చంద్రబాబుని విశ్వసిస్తారా అన్నదానిపై ఆ ఇద్దరి భవిష్యత్ తో పాటు ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో బాబు, జగన్ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేస్తూనే ఆ ఇద్దరు ఇంగ్లీష్ యుద్ధం కూడా చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా…
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు దిగ్గజ నేతగా ఎదగడానికి మీడియా ప్రభావం బాగా పనిచేసిందని జగన్ నమ్మకం. అందుకే అదే రూట్ లో వెళ్తున్నారు జగన్. తెలుగు మీడియా లో వివిధ చానెల్స్ లో లోపాయికారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే సోషల్ మీడియా ప్రభంజనంలో మీడియా లో వచ్చిన దానిపై నమ్మకం తగ్గడంతో ఆ పెట్టుబడులకు తగ్గ ఫలితం లేదని భావించారు జగన్. పైగా నేషనల్ మీడియాలో అనుకూల వార్తలు వస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అండ దొరుకుతుందని జగన్ ఆశ. అనుకున్నదే తడవుగా వైసీపీ తరపున కొందరు ఢిల్లీ, ముంబై లో దిగడం ఆయా ఇంగ్లీష్ పత్రికలు, చానెల్స్ తో సంప్రదించడం జరిగిపోయింది. దీంతో ఇంగ్లీష్ పత్రికల్లో, చానెల్స్ లో హఠాత్తుగా బాబు వ్యతిరేక, జగన్ అనుకూల వార్తలు పెరిగాయి. దాని ప్రభావం ఎంతోకొంత బీజేపీ, టీడీపీ బంధం మీద పడింది. ఆ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేషనల్ మీడియా మీద దృష్టి సారించారు. అందుకే నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో బాబుని కాల్చి చంపాలన్న జగన్ కి వ్యతిరేకంగా ఇంగ్లీష్ పత్రికల్లో పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి. పయనీర్ లాంటి పత్రికలు సంపాదకీయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి జగన్ ని ఏకిపారేశాయి. ఈ విధంగా యుద్ధం ఏపీ లో అయితే జగన్, బాబు ఇంగ్లీష్ పేపర్స్ లో కత్తులు దూసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: