Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు చేరువకావడమే ప్రధాన ఉద్దేశంగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వడదెబ్బ తగిలిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గత సంవత్సరం మొదలుపెట్టిన పాదయాత్ర దాదాపు ఆరు నెలలగా శుక్రవారం మినహాయించి విజయవంతంగా కొనసాగుతుంది. మండు వేసవిని కూడా పట్టించుకోకుండా పాదయాత్ర చేస్తుండటంతో జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో… వడదెబ్బ తగిలిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు.
జగన్ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. అస్వస్థతకు గురయినప్పటికీ పాదయాత్రను కొనసాగించారని తెలిపారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. అయినప్పటికీ ఆయన తన పాదయత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా కొప్పర్రు నుండి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి లిఖితపుడి, సరిపల్లి, చినమామిడి పల్లి మీదుగా నర్సాపురం వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది.