జగన్ చేసిన ప్రకటన…వెనక వ్యూహం ఇదేనా ?

YS Jagan Master Strategy Behind Padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొండనాలుకకి మందేస్తే అసలు నాలుక ఊడిందనే సామెత ఇప్పుడు జగన్ కు కరెక్ట్ గా సూట్ అవుద్దేమో ? ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ కోసం ఆశ పడుతూ ఇప్పటి దాకా తమతో ఉన్న తమ వోటు బ్యాంకుని చేజార్చుకునే పరిస్థితికి వచ్చాడు జగన్. వైసీపీ కానీ జగన్ కాని ఇప్పటిదాకా తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు మీదనే ఆయన సానుభూతితోనే నడుస్తున్నారు. అసలు ఆ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను బేస్ చేసుకుని, ఆయన ఫోటో తో పార్టీ జెండా ఏర్పడింది. ఆయన పాలన రాముడి పాలన అంటూ రామ రాజ్యం తెస్తాం అంటూ కొన్ని వర్గాలని కలిపి ఒక వోటు బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నాడు జగన్. అయితే ఇప్పుడా వోటు బ్యాంకుకి గండి పడే అవకాసం కనిపిస్తోంది.

వైఎస్ రాజకీయం ప్రారంభించినప్పటి నుండి తలపడింది ఎన్టీఆర్ తోనే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ తీవ్రమైన విమర్శలు చేసేవారు. అందులో వ్యక్తిగతమైనవి ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ పై వైఎస్ తన వ్యతిరేక భావాన్ని వదలి పెట్టలేదు. బేగంపేట విమాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేది. శంషాబాద్ లో కొత్త విమాశ్రయం ప్రారంభోత్సవ సమయంలో.. ఎన్టీఆర్ పేరు పెట్టాల్సి ఉంది. కానీ వైఎస్ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అలాంటిది ఇప్పుడు టీడీపీకి అండగా ఉండే ఓ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. గతంలోనూ ఓదార్పు యాత్ర లాంటి ఒకటి రెండు సందర్భాల్లో… ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్ కు అమితమైన ప్రాధాన్యం ఇస్తే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు పార్టీ నుంచి రావడంతో ఆయన సైలెంటయిపోయారు.

కానీ ఇప్పుడు మళ్లీ జగన్ చేసిన ప్రకటన వైసీపీలోనూ కలకలం రేపుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు, క‌మ్మ కులాల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు ఇప్ప‌టికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లుగానే ఉంటుంది. అందులోనూ కృష్ణాజిల్లాలో ఇరు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య నాలుగు ద‌శ‌బ్దాలుగా వంగ‌వీటి వ‌ర్సెస్‌ దేవినేని కుటుంబాల మ‌ధ్య ర‌క్త‌చ‌రిత్ర తెలిసిందే. ఇప్ప‌టికే వంగ‌వీటి రాధాకృష్ణ‌ తండ్రి రంగాను పాముతో పోల్చిన గౌతంరెడ్డిపై వైసీపీ స‌స్పెన్ష‌న్ ర‌ద్దు చేసింది. ఈ లెక్క‌న‌.. ఇప్ప‌టి వర‌కూ వైసీపీ కాపుల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌నే సానుభూతి ఇప్పుడు జిల్లాకి ఎన్టీఅర్ పేరు అనే కాన్సెప్ట్తో దెబ్బకు ప‌టాపంచ‌లైంది. దీంతో ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనుకుంటే.. అస‌లుకే ఎస‌రు వ‌చ్చిన‌ట్ట‌యింది. ఇప్పుడు వైసీపీ అంటే.. వైఎస్. టీడీపీ అంటే ఎన్టీఆర్. ఒక పార్టీ వారు మరొక నేతను అభిమానించే పరిస్థితి లేదు. ప్రత్యర్థి బలహీనత మీద దెబ్బకొట్టాలి కానీ.. ప్రత్యర్థి బలం పెంచడానికి ప్రయత్నించడమేమిటని వైసీపీ వ్యూహకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ ను పొగిడినంత మాత్రాన..ఓ జిల్లాకు పేరు పెడతామన్నంత మాత్రాన.. టీడీపీ ఓటు బ్యాంక్ … తమ వైపు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ వోటు బ్యాంకు టీడీపీ వైపు చూస్తే ఇక జగన్ సిఎం ఆశలు ఈసారి కూడా గల్లంతు అవడం ఖాయం.