జగన్ ఆ స్వామి చెప్పినట్టే నడుచుకుంటారు.

ys-jagan-political-decision-swamiji

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కలలు కంటున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తాను తలపెట్టిన పాదయాత్ర తిరుగులేని అస్త్రం అవుతుందని భావిస్తున్నారు. ముందుగా అక్టోబర్ 27 న జగన్ పాదయాత్ర మొదలు అవుతుందని ప్రకటించారు. అయితే తాజాగా అనివార్య కారణాలతో ఆ పాదయాత్ర ప్రారంభం అయ్యే డేట్ మార్చేశారు. అక్టోబర్ 27 అనుకున్న దాన్ని కాస్త నవంబర్ 2 కి మార్చారు. రాజకీయాల్లో ఇలా మార్పులు, చేర్పులు సహజమే . అయితే జగన్ ఈ డేట్ మార్చడం వెనుక కారణం వేరే ఉందట. ఇదేదో షెడ్యూల్ లో వచ్చిన మార్పు కాదట. జగన్ పాదయాత్ర కోసం పెట్టుకున్న ముహూర్తం మంచిది కాదట.

జగన్ పాదయాత్ర ప్రారంభం డేట్ కి సంబందించిన ప్రకటన రాగానే ఓ స్వామీజీ అలెర్ట్ అయ్యారట. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పడిపోయి ఎప్పుడెప్పుడు వైసీపీ సర్కార్ వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ, అందుకు తన వంతుగా అప్పుడప్పుడు బాబు మీద విమర్శలు, జగన్ తో పూజలు చేయిస్తున్న సదరు స్వామి ఆ ముహూర్తం బాగా లేదని ఫీల్ అయ్యారట. అనుకున్నదే తడవుగా వైసీపీ ముఖ్యులకు ఈ విషయం చేరవేశారట. అయితే ఒక్కసారి డేట్ ప్రకటించాక మారిస్తే బాగుండదని సమాధానం వచ్చిందట. అయితే ఆ స్వామి ఆ సమాధానంతో సంతృప్తి పడకుండా తన వంతు ప్రయత్నాలు కొనసాగించారట. తనతో పాటు మరికొందరు జ్యోతిష్కులు అక్టోబర్ 27 దుర్ముహూర్తమని చెప్పిన పత్రాలు జత చేసి వైసీపీ ముఖ్యులకు పంపారట. ముందుగా అనుకున్నట్టు ఆ డేట్ న పాదయాత్ర మొదలు పెట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదని, సీఎం పీఠం దక్కే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట. అయితే అప్పటిదాకా వూ …ఆ…అన్న జగన్ కోటరీ సీఎం పీఠం గురించి చెప్పగానే అలెర్ట్ అయ్యారట.

స్వామిజి పంపిన సమాచారంతో పాటు మరికొందరు పండితుల్ని కూడా సంప్రదించారట. చివరకు వాళ్ళు కూడా అది మంచి ముహూర్తం కాదని చెప్పడంతో జగన్ తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందట. నవంబర్ 1 లేదా 2 తేదీల్లో పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుందని ఆ స్వామి ముహూర్తం ఖరారు చేస్తే అందుకు తగ్గట్టు డేట్ మార్చుకున్నారట జగన్. ఆ విధంగా ఆ స్వామి చెప్పినట్టే నడుచుకుంటుంన్నారు జగన్.