Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలకి అవినీతిని వేరు చేసి చూడాలంటే పాలల్లో కలిసిన నీటిని వేరు చేసి చూడాలి అనుకోవడమే. పురాణాల్లో చెప్పినట్టు ఆ పని హంసల వల్ల అయినా అవుతుందేమో గానీ అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నేతల్ని చూడడం మనలాంటి మామూలు మనుషుల వల్ల కాదు. ఇప్పుడు వైసీపీ ప్లీనరీ లో కూడా సీఎం చంద్రబాబు మీద భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు ఆ పార్టీ నేతలు. అంతటితో ఆగకుండా ఎంపరర్ అఫ్ కరప్షన్ అంటూ చంద్రబాబు మీద ఓ పుస్తకం విడుదల చేశారు.
వై.ఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇదే విధంగా ఆయన మీద టీడీపీ రాజా అఫ్ కరప్షన్ అనే పుస్తకం వేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచిపెట్టింది. వై.ఎస్, ఆయన తనయుడు జగన్ అవినీతి ద్వారా లక్ష కోట్ల కి పైగా సంపాదించారని టీడీపీ ఆ పుస్తకంలో వివరించింది. ఆ ప్రచారం తదనంతర కాలంలో జగన్ మీద కేసులు పడేందుకు ఓ అవకాశం కల్పించింది. ఇప్పుడు తనని లక్ష కోట్లు తిన్నారు అన్న చంద్రబాబు మీద 3 లక్షల 75 వేల కోట్ల అవినీతి చేశారని వైసీపీ ఆరోపించింది. ఒక్క రాజధానిలోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎంపరర్ అఫ్ కరప్షన్ పుస్తకంలో వివరించారు. అంటే జగన్ ఒక్క ఆకు తింటే బాబు మూడు ఆకుల ముప్పైమూడు ఈనెలు తిన్నాడన్న మాట. వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు సరే వాటిని జనం ఎంతగా నమ్ముతారో చూద్దాం.
మరిన్ని వార్తలు