Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ కు మొదటి శత్రువు బాబు అయితే, రెండో శత్రువు కచ్చితంగా వెంకయ్య నాయుడే. అందుకే మొన్న కోవింద్ హైదరాబాద్ వచ్చినప్పుడు వెంకయ్యతో ఫోటోలు దిగిన ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు. తర్వాత ఎంత కవర్ చేసుకున్నా ఆ ఎపిసోడ్ పెద్ద రచ్చకు దారితీసింది. కేంద్రమంత్రితో ఫోటోలు దిగితే మీకేంటని అమిత్ షా కూడా జగన్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తాను ఎవరినైతే వ్యతిరేకిస్తానో.. అలాంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ కు. మోడీకి ముందుగానే వాగ్దానం చేశారు కాబట్టి… ఎవర్ని నిలబెట్టినా మద్దతివ్వాల్సిందే. లేకపోతే ఏమౌతుందో జగన్ కు బాగా తెలుసు. కేసుల విచారణ వేగవంతమైతే.. జగన్ జైలుకెళ్లడానికి కొన్ని నెలల సమయమే పడుతుంది. అప్పుడు వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
అందుకే దగ్గరి కష్టాల్ని దిగమింగి, దూరపు సుఖాల కోసం చూసుకోవాలని జగన్ వేదాంతం మాట్లాడుతున్నారు. పార్టీ శ్రేణులకు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఏం చేసైనా సరే నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం కావాలనేది జగన్ టార్గెట్. మరి ఆ లక్ష్యం నెరవేరాలంటే జగన్ కు ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆయన నాయకత్వాన్ని జనం ఎంతవరకు నమ్ముతారనేదానిమీదే ఆధారపడి ఉంది.
మరిన్ని వార్తలు