Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు తెర లేపింది. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వైసీపీ కి చెందిన 35 మంది పోలీసులకి దొరికిపోయారు. వారి వద్ద నుంచి దాదాపు ఆరు లక్షలకి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా వేరే ప్రాంతాల నుంచి డబ్బు పంపిణీ కోసమే వచ్చినట్టు తెలుస్తోంది. కడప, నెల్లూరు జిల్లాలతో పాటు కర్నూల్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వీళ్లంతా. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమంది వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కి చెందిన వాళ్ళు.
ఈ అరెస్ట్ లతో ఉలిక్కిపడ్డ వైసీపీ నష్ట నివారణకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని రంగంలోకి దించింది. ఆయన నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి వితండ వాదన చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు మాత్రమే వైసీపీ కార్యకర్తలని, వారు కూడా ఖర్చుల కోసం తమ దగ్గర డబ్బులు వుంచుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. ఇదే మాటలు చెప్పి పోలీసులతో వాగ్వాదం చేశారు. అయినా వైసీపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో ఖాకీలు వేస్తున్న చాలా ప్రశ్నలకి శ్రీకాంత్ రెడ్డి తో పాటు అరెస్ట్ అయిన వారి దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
మరిన్ని వార్తలు: