మరో 15 రోజుల్లో లోకేష్ జైలుకు వెళ్తారా ?

IV Reddy says Nara Lokesh may go to Jail

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగానే కాక పంచాయతీ రాజ్ మంత్రిగా, ఐటీ శాఖా మంత్రిగా తనదయిన ముద్ర వేసిన నాయకుడు, ఆయన అయితే ప్రత్యక్షంగా కాకుండా దొడ్డి దారిన మంత్రి అయ్యారనే విమర్శలు ఆయన మొదటి నుండి ఎదుర్కుంటూనే ఉన్నాడు. అయితే తన పనితనం సమాధానం కావాలి కాని, ఇలాంటి విషయాల మీద తానెప్పుడు స్పందించను అని తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే ఇటీవలి కాలంలో లోకేష్ అవినీతి మీద చర్చ జరుగుతుంది. మంత్రి గాక ముందునుండే అంటే తన తండ్రి ముఖ్యమంత్రి అయిన నాటి నుండే లోకేష్ వసూళ్ళ దందా నడుస్తుంది అని ప్రచారం మొదలుపెట్టాయి ప్రతిపక్ష వైసీపీ, ఇప్పుడిప్పుడే రాజకీయం చేస్తున్న పవన్ పార్టీ. అయితే చంద్రబాబు వద్ద తన స్నేహితుడు అభీష్టను ఓఎస్టీగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉన్నత విద్యావంతుడైన అబీష్ట తనలోని సత్తా ఆధారంగానే ఆ పోస్ట్‌కు ఎంపికయ్యారని ప్రభుత్వం వివరణ ఇచ్చినా లోకేష్ స్నేహితుడు అనే ఒకే ఒక్క కారణంతో ఆయన్ని ఆ పదవి నుండి సాగనంపేసారు.

అయితే తదుపరి మంత్రి అయిన లోకేష్ తన శాఖల పని తీరు మెరుగుపరచడం మీద ద్రుష్టి పెట్టినా విమర్శలు మాత్రం ఆగలేదు. ప్రతిదాంట్లోనూ చినబాబుకు కమీషన్లు వెళ్ళాల్సిందే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే వస్తోంది. ఇక ఇటీవలే పవన్ కల్యాణ్ కూడా అదే ఆరోపణ చేశాడు. లోకేష్ అవినీతి గురించి ప్రస్తావిస్తూ శేఖర్ రెడ్డి వ్యవహారంలో లోకేష్‌కు కూడా వాటాలున్నాయని పవన్ అన్నాడు. అయితే తెలుగుదేశం బీజేపీ విడిపోయిన నాటి నుండి కూడా బీజీపీ తమ మీద కుట్ర చేస్తోందని రాష్ట్రంలో ఏ నిముషంలో ఏమయినా జరగచ్చునని బాబు వాపోతున్నాడు. పవన్-జగన్ లు బీజేపీ సహకారంతో తనని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అనడం అలాగే ఇప్పుడు గిద్దలూరు వైసీపీ నేత ఒకరు లోకేష్ జైలుకి వెళ్ళడం ఖాయం అనడం చూస్తోంటే మొత్తానికి లోకేష్-బాబుల వెనుక పెద్ద కుట్రే జరుగుతుంది అనిపిస్తోంది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇంచార్జ్ ఐవి రెడ్డి ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ గురించి చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఐవి రెడ్డి తన ఇంటర్వ్యూలో లోకేష్ జైలుకు వెళ్ళడం పట్ల ఏకంగా డేట్ కూడా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 15 తర్వాత లోకేష్ జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ ఆయన చాలెంజ్ చేసి చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అధికార పార్టీలో కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అందులోనూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడి మీదే అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్తారు అని ఐవి రెడ్డి చెప్పడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక పక్క జనసేన అధినేత పవన్ లోకేష్ మీద ఆరోపణలు చేయడం, ఇంకొన్ని రోజుల్లో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరగనున్నాయి అని అమిత్ షా జగన్ ని హెచ్చరించడం, బీజేపీ నేత రాం మాధవ్ కూడా ఇంకొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అనే అర్ధం వచ్చేలా మాట్లాడడం చూస్తే ఏదో జరగనుందని అర్ధం అవుతోంది. ఈ ఇంటర్వ్యు పూర్తి వీడియో వస్తే కాని లోకేష్ మీద ఆయన ఆ జైలు వ్యాఖ్యలు చేసాడో అర్ధమవుతుంది.