Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ బయోపిక్ కి హీరో, దర్శకుడు, నిర్మాతలు… అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా వచ్చేసి 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రజల్ని టీడీపీ వైపు లాగుతుందేమో అన్న భయం వైసీపీ ని వెంటాడుతోంది. అందుకే ఎందుకైనా మంచిదని వై.ఎస్ జీవిత చరిత్రను కూడా వెండితెర మీదకు తేవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సినిమాకి కావాల్సిన కథ రెడీ. ఎదురుగా వై.ఎస్ జీవితం వుంది. అందులో ఏ పేజీలు ప్రజలకు చూపించాలి అన్నది మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం. దీనికి సంబంధించి ఓ దర్శకుడు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. ఆయనే ఆనందోబ్రహ్మ లాంటి హారర్ కామెడీ తీసిన మహి.వి. రాఘవ్. వై.ఎస్ మీద సినిమా అయితే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు అనుకుని చాలా టైం తీసుకుని ఈ దర్శకుడు స్క్రిప్ట్ మీద పని చేసారంట. దర్శకుడు పాయింట్ అఫ్ వ్యూ వైసీపీ లోని పెద్దలకు కూడా బాగా నచ్చిందట. అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదట.
నిజానికి ఓ పార్టీ అండదండ ఉంటే వై.ఎస్ బయోపిక్ తీయడం కష్టం కాదని దర్శకుడు అనుకున్నారట. వైసీపీ నేతలు కూడా ఈ ఐడియా విన్నప్పుడు ఇచ్చిన రియాక్షన్స్ చూసి ఇదేదో తేలిగ్గా అయిపోయే వ్యవహారం అని దర్శకుడు కూడా అనుకున్నారట. కానీ అందరూ పొగడ్తలకు పరిమితం కానీ సినిమా మీద డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదట. దీంతో ఇప్పుడు వై,ఎస్ సినిమాకి నిర్మాత కావలెను అన్న ప్రకటన ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం వైసీపీ అధినేత జగన్ దగ్గరకు వెళ్లిందట. దీంతో ఆ సినిమా చేసి తీరాలని జగన్ అనడంతో పార్టీకి చెందిన యువ ఎంపీ నిర్మాతగా ఉండడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కానీ ఈ పరిణామాలు దగ్గరగా చూస్తున్న వైసీపీ నేత ఒకరు భలే కామెంట్ చేసారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా చేయడానికి వైసీపీ నాయకుడు నిర్మాత కావడానికి రెడీ అయ్యాడు గానీ వై.ఎస్ మీద సినిమా అంటే ప్రొడ్యూసర్ కోసం వెదుక్కోవాల్సి వచ్చింది అన్న ఆ నేత కామెంట్స్ లో ఎంతో నిజం వుంది కదా !