Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగుతున్న కాలంలోనే తెరపైకి వచ్చిన వైసీపీ, బీజేపీ మిత్రబంధం…ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక హోదా సహా విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా…కేంద్రమంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేయడంతో..ఇప్పుడందరూ బీజేపీతో వైసీపీకి ఏర్పడబోయే చెలిమిగురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైసీపీ నేతలు ప్రకటించడంతో..రెండు పార్టీల స్నేహంపై కాస్త సందిగ్ధం నెలకొంది. జాతీయ న్యూస్ చానల్ ఇండియా టుడేలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందిగ్ధానికి తెరదించారు. తమ పయనం బీజేపీతోనే అని పరోక్షంగా తేల్చిచెప్పారు. తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందని, ఏపీకి హోదా ఇచ్చేవారికే మద్దతు ఇస్తామని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారని విజయ్ సాయిరెడ్డి చర్చలో భాగంగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రాజ్ దీప్ సర్దేశాయ్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా…మరి ఆ పార్టీతో కలుస్తారా..అని అడగ్గా…విజయ్ సాయిరెడ్డి విచిత్ర సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని కాబట్టి ఆ పార్టీని నమ్మలేమ్మన్నది ఆయన అభిప్రాయం. ఆయన నమ్మకం ప్రకారం బీజేపీ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వగలదట. తమ డిమాండ్ ను మోడీ అంగీకరిస్తారట.
ఈ వ్యాఖ్యల తరువాత రాజ్ దీప్ సర్దేశాయ్ మరో సూటిప్రశ్న అడిగారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో వైసీపీ జతకడుతుందా అని ప్రశ్నించారు. హోదా ఇస్తామన్నవారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని విజయ్ సాయిరెడ్డి చెప్పుకొచ్చాడు. నిజానికి ఆయన వ్యాఖ్యల్లో అవకాశవాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనే చెప్పినట్టు కాంగ్రెస్ చిత్తశుద్ధిపై ఏపీ ప్రజలందరిలో అనుమానం ఉంది. కాబట్టి ఆ పార్టీని నమ్మలేం. అదే సమయంలో విభజన హామీల విషయంలో ఏపీని మోసం చేసిన బీజేపీపైకూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ వైఖరి కళ్లముందు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కూడా. ప్రత్యేక హోదా అన్నది సాధ్యమే కాదని అరుణ్ జైట్లీ స్పష్టాతిస్పష్టంగా తేల్చేశారు. అయినా సరే…తాము కోరినట్టు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందని, అందుకు ప్రతిగా తాము ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటామని వైసీపీ నేతలనడం…ప్రజలను మభ్యపెట్టడానికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవిశ్వాస తీర్మానం అంటూ పైకిచెబుతున్నప్పటికీ..ఎప్పుడెప్పుడు బీజేపీతో కలిసి నడవాలా అని వైసీపీ ఎంతో ఆతృతగా ఎదరుచూస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.