Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత జగన్ నోటి నుంచి ఎక్కువ సార్లు వచ్చిన మాట ఏమిటో లెక్కబెడితే ” నేను సీఎం అయ్యాక ” కి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. పాపం ఆయన సీఎం కల అయితే అంతగా కన్నాడు గానీ అందుకు అవసరమైన వ్యూహాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వున్నాడు. అందుకే 2014 ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడు. అయినా జనం ఏదో తప్పు చేశారన్న మూడ్ లో ఉండిపోయారు. అందుకే 2019 లో అధికారంలోకి రావడానికి కొత్త ఆలోచనలు ఏమీ చేయకుండా ఒకప్పుడు తండ్రి వై.ఎస్ అమలు చేసిన పథకాల్ని గుదిగుచ్చి నవరత్నాలు పేరిట ప్రచారం చేశారు. అయినా ప్రయోజనం లేదు. ఇక పార్టీ పెట్టినప్పటినుంచి చంద్రబాబు ఏమి చేసినా తప్పు పట్టడం అనే పాచిపోయిన వ్యూహం కూడా పని చేయలేదు. ఇక ఏపీ కి ప్రత్యేక హోదా అంశం కొన్నాళ్ళు పనికి వచ్చినా బీజేపీ తో అవసరాలతో దాన్ని కూడా మూలన పడేసారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని దుమ్ము దులిపినా అప్పటికే తుప్పు పట్టి పోయింది.
పార్టీని అధికారంలోకి తేవాలని తెలుసు గానీ అందుకు ఏమి చేయాలో తెలియని అయోమయంలో జగన్ ఉండగానే నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు పులి మీద పుట్రలా విరుచుకు పడ్డాయి. ఆ ఫలితాలు చూసాక వైసీపీ గెలుపు మీద జగన్ కి, జగన్ నాయకత్వం మీద వైసీపీ శ్రేణులకు నమ్మకం పోయింది. ఇక జగన్ ని జనం నమ్మరని ఆ పార్టీ నేతలకు అర్ధం అయిపోయింది. వయసు రీత్యా సీనియర్ అయిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అందరి కంటే ముందుగా గ్రహించారు. అందుకే ఆయన కొత్త స్లోగన్ అందుకున్నారు. ఇంకా అవీఇవీ చెప్పడం కాకుండా నేరుగా జగన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతామని ఆయన అంటున్నారు. అధికారంలోకి రాకముందు వై. ఎస్ మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయని కానీ సీఎం అయ్యాక ఆయన ఎంత మంచి పాలన ఇచ్చాడో గుర్తు చేస్తూ జగన్ కి కూడా అలాగే ఛాన్స్ ఇవ్వమని అడగడానికి సిద్ధం అంటున్నారు మేకపాటి. అంటే 2019 ఎన్నికలకి ఇంకా ఏడాది ఉండగానే వైసీపీ అస్త్రాలన్నీ ఖాళీ అయిపోయి ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న స్లోగన్ మాత్రం మిగిలిపోయిందన్న మాట. వాట్ ఏ పిటీ ?