Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయసాయిరెడ్డి…జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయ్యేవరకు ఆయనంటే ఎవరో తెలిదు ప్రజానీకానికి. ఏమనుకున్నాడో ఏమో అసలేమాత్రం రాజకీయ అనుభవం లేని ఆయన్ని జగన్ తెచ్చి రాజ్యసభ సీటు ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేయించాడు. అయితే అటువంటి ఆయన చంద్రబాబు పేరు చెబితేనే ఇంతెత్తున లేస్తాడు. అలాంటిది ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన ఒకటి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఆదేశిస్తే గనుక.. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద కూడా పోటీ చేయడానికి సిద్ధమే అని విజయ సాయి ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి ప్రకటన చూసినప్పుడు.. ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో గట్టి పట్టు ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఆయన మీద పోటీపడడానికి ఎక్కడో నెల్లూరు జిల్లాకు చెందిన, ప్రత్యక్ష రాజకేయాల్లో వార్డ్ మెంబర్ గా కూడా గెలవని ఓ వ్యక్తి సవాలు విసురుతున్నాడంటే దాని వెనుక చిన్న మతలబు ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
విజయ సాయి వెంట్రుక కొండ పాలసీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. కొండకి వెంట్రుక వేస్తే వస్తే కొండ వస్తుంది లేదా వెంట్రుక ఊడుతుంది అనే చందాన ఈ ప్రకటన చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబుకి కంచు కోట లాంటి కుప్పంలో డీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇందులో విజయ సాయి ప్లాన్ వేరే ఉందని అది కుప్పం అసెంబ్లీ కాదని చిత్తూరు ఎంపీ స్థానం గెలిపించుకునేందుకు ఆయన అటువంటి ప్రకటన ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు ఎంపీ పరిధిలో అన్నిచోట్లా తెదేపా ఓడినా.. కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీతోనే.. చిత్తూరు ఎంపీ స్థానాన్ని కూడా గెలుస్తుంటుంది. అలాంటి నేపథ్యంలో.. కుప్పంలో చంద్రబాబు మెజారిటీకి కొంత మేరకు గండికొట్టగలిగితే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. చిత్తూరు ఎంపీ సీటును వైకాపా గెలుచుకోగలుగుతుంది అని వారు లెక్కలు వేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.