Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. అదే సమయంలో ఈ సినిమాపై విమర్శల వర్షం కూడా కురుస్తుంది. సినీ ప్రముఖులు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, సమంత, అను ఎమాన్యూల్ మరియు మంత్రి కేటీఆర్ కూడా ఈ చిత్రంను ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీశారని, యువతను పూర్తిగా పెడద్రోవ పట్టించే సినిమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముద్దు సీన్స్, ముద్దు పోస్టర్స్ వల్ల యువత చెడ్డ దారిలో నడిచే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఇక తాజాగా వైకాపా మహిళ నాయకురాళ్లు ఈ సినిమాను బ్యాన్ చేయాలని, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శణను నిలిపేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సెన్సార్ బోర్డు సభ్యులకు వినతి పత్రంను అందించడం జరిగింది. కోర్టును కూడా ఆశ్రయిస్తామని వారు చెబుతున్నారు. ఆడవారిని చులకన భావంతో చూడటంతో పాటు, ర్యాగింగ్‌ను సమర్థించే విధంగా ఉందని, యువత మత్తు పదార్థాలు తీసుకునేలా సినిమాలోని సీన్స్ ఉన్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు. మొత్తానికి సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా వివాదాలతో సతమతం అవుతూనే ఉంది. మరి కోర్టు ఈ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.