చిరుకు పవన్‌ శుభాకాంక్షలు

pawan kalyan meets to chiranjeevi and says birthday wishes him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెపడం జరిగింది. ప్రస్తుతం తన 25వ చిత్రంతో బిజీగా ఉన్నా కూడా చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పి, అన్నయ్య త్వరలో చేయబోతున్న సినిమాకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో చిరు 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ లోగోను చూడటంతో పాటు, ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చూసినట్లుగా తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌కు పవన్‌ కళ్యాణ్‌ ఫిదా అయ్యాడట. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంను కూడా పవన్‌ వ్యక్తం చేశాడు. నేడు లోగో లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా కూడా షూటింగ్‌ బిజీతో రాలేదని మెగా ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను వచ్చే నెల 2న ప్రకటించనున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న పవన్‌ 25 చిత్రంలో అను ఎమాన్యూల్‌ మరియు కీర్తి సురేష్‌లు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

స్పైడ‌ర్ లో బ్రిజేశ్ శాండల్య పాట‌

అర్జున్‌ రెడ్డి మాటలు శృతిమించుతున్నాయి

సైరా నరసింహారెడ్డి.. టైటిల్‌ వివాదం