హీరో కూతురు అందం కోసం ఆపరేషన్‌..!

rajasekhar daughter shivani lips surgery

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన రాజశేఖర్‌ వారసురాలిగా ఆయన కూతురు శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. జీవిత రాజశేఖర్‌ కూతురు శివాని ఒక తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానుందనే వార్తలు వస్తున్నాయి. శివాని హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది అంటూ మూడు నాలుగు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి. అయితే ఇంత కాలం మెడిసిన్‌ చదివిన శివాని సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా మెడిసిన్‌ పూర్తి అవ్వడంతో శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మెడిసిన్‌ చేసే సమయంలోనే శివాని నటనలో శిక్షణ తీసుకుంది. నటనతో పాటు డాన్స్‌ మరియు దర్శకత్వంలో కూడా ఆమెకు ప్రావిణ్యం ఉంది. దాంతో తమిళంలో ఆమె స్టార్‌ అవ్వడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అయితే ఆమె పెదాలు కాస్త లడ్డుగా ఉండటం ఆమెకు పెద్ద మైనస్‌ అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. దాంతో ఆమె తన పెదాల సైజ్‌ను తగ్గించుకునేందుకు ఆపరేషన్‌ చేయించుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు జీవిత మరియు రాజశేఖర్‌లు కూడా ఓకే చెప్పారు. స్వతహాగా రాజశేఖర్‌ ఒక డాక్టర్‌. దాంతో ఆయన దగ్గరుండి మరీ కూతురు లిప్స్‌కు ఆపరేషన్‌ చేయించే అవకాశాలున్నాయి. మరో వైపు ఈమె తెలుగులో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఒక ప్రముఖ నిర్మాత ఈమెతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ హౌస్‌మెంట్స్‌ పారితోషికాలు ఎంతో తెలుసా?

మంచు వారి ఇంటకి మరో బుజ్జాయి

పిక్‌టాక్‌: బాహుబలి నుండి బయట పడ్డట్లే