హీరోలందరిలో రానా ప్రత్యేకం..!

Rana Is Different From Other Heros In Movie Industry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇతర భాషల హీరోలతో పోల్చితే టాలీవుడ్‌ హీరోలు చాలా ప్రత్యేకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు హీరోలు ఇమేజ్‌ చట్రంలో పడి ఉంటారు. ఒక ఇమేజ్‌ దక్కిన తర్వాత ఆ ఇమేజ్‌ నుండి బయటకు వచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తిని కనబర్చరు. ఉదాహరణకు  స్టార్ హీరో మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌లను తీసుకుంటే వారు మాస్‌ ఆడియన్స్‌ను అలరించే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటారు. వారు రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలను చేసేందుకు ఆసక్తి చూపించరు. అంటే మన హీరోలు ఎప్పుడు కూడా ఒకే తరహా సినిమాలు మాత్రమే చేస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే టాలీవుడ్‌ అందరు హీరోలకు రానాకు పూర్తి వైవిధ్యం ఉంది.

తెలుగు హీరోలు విలన్‌ పాత్రలు చేసేందుకు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసేందుకు అంగీకరించరు. కాని రానా ఎలాంటి పాత్ర అయినా, ఏ సినిమాలో అయినా నటించేందుకు ముందు ఉంటాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో కూడా సినిమాలు చేసిన ఘనత రానాకు దక్కుతుంది. ఇక హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో విలన్‌ పాత్రలు పోషించడం లేదా ముఖ్య పాత్రలు పోషించడం అనేది ఏ ఒక్కరు చేయరు. కాని రానా మాత్రం ఆ సాహసం చేశాడు. ‘బాహుబలి’ సినిమాలో విలన్‌గా నటించి విశ్వరూపం చూపించాడు. ఇక మరో వైపు బుల్లి తెరపై నెం.1 యారి చేస్తున్నాడు. చిన్న నటీనటులు మాత్రమే చేసే వెబ్‌ సిరీస్‌ను కూడా రానా చేస్తున్నాడు. తాజాగా హాలీవుడ్‌ సినిమాకు సైన్‌ చేశాడు. ఇలా పలు రకాలుగా రానా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇతర హీరోలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

మరిన్ని వార్తలు